Abdul Aziz: జగన్‌ది దండుపాళెం బ్యాచ్ ప్రభుత్వం
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:35 AM
వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో బోర్డు 4వ సమావేశాన్ని శనివారం నెల్లూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ముస్లింల డబ్బు 386 కోట్లు ఏమయ్యాయి?
ముస్లింల ద్రోహిగా మిగిలిపోయారు: వక్ఫ్‌బోర్డు
నెల్లూరు(సిటీ), జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెట్టినట్లుగా చూపి కేంద్రం నుంచి తీసుకున్న రూ.386 కోట్లు ఎక్కడున్నాయ్? ఏమయ్యాయి జగన్?’ అని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో బోర్డు 4వ సమావేశాన్ని శనివారం నెల్లూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.386 కోట్లలో రూపాయి కూడా ముస్లిం, మైనార్టీ ల అభ్యున్నతికి ఖర్చు చేయలేదన్నారు. 25 శాతం ముస్లింలు జీవించే ప్రాం తాల్లో అమలు చేయాల్సిన ప్రధానమంత్రి జీవన వయో యోజన్(పీఎంజేవీవై)ను కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు.
జగన్ ప్రభు త్వం ముస్లింల పేరిట కేంద్రం వద్ద నిధులు దండుకున్న దండుపాళెం బ్యా చ్ అని ఆరోపించారు. జగన్ ముస్లింల ద్రోహిగా మిగిలిపోయారని దుయ్యపట్టారు. వక్ఫ్‌బోర్డు నుంచి వచ్చే ప్రతీ రూపాయిని పేద ముస్లింలకు ఖర్చు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వక్ప్‌భూములు 65 వేల ఎకరాలుండగా, అందులో 35 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్నారు. వాటిని బయటకు తీయడంతోపాటు మిగిలిన భూముల ద్వారా ఆదాయ మార్గాలు అన్వేషించి ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పారు. పీ-4 పథకం ద్వారా ప్రతి పేద ముస్లింను చేయిపట్టుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.