Share News

YSRCP Jagan: జగన్‌ బ్యాచ్‌కు 41ఏ నోటీసులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:58 AM

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు

 YSRCP Jagan: జగన్‌ బ్యాచ్‌కు 41ఏ నోటీసులు

గుంటూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా నేతలకు మంగళవారం 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ జగన్‌ మిర్చి యార్డు పర్యటనకు వచ్చారు. అయితే, కోడ్‌ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీస్‌ ఆంక్షలు ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్‌ ర్యాలీగా మిర్చి యార్డుకు వచ్చారు. లేరని సిబ్బంది చెప్పారు.


దీనిపై అదే రోజు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 206/2025తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌తో పాటు వైసీపీ తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు తదితరులు ఉన్నారు. జగన్‌ మినహా మిగిలిన వారికి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు.

Updated Date - Jun 25 , 2025 | 05:58 AM