Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:04 AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతోపాటు వారాంతం కావడంతో ఎక్కడ చూసినా గుంపులుగా భక్తులు కనిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతోపాటు నారాయణగిరిలో 4 షెడ్లలో సర్వదర్శన భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ఇక స్లాటెడ్ టికెట్లు, టోకెన్లు ఉన్నవారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం తర్వాత దర్శనం లభిస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద భవనం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. వసతి గదులకు డిమాండ్ కొనసాగుతోంది. గదులు లభించని భక్తులు షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు, పార్కులు, కార్యాలయాల ముందు నేలమీదే సేదతీరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News