Share News

Heatwave : పెరిగిన ఎండ

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:20 AM

వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది.

Heatwave : పెరిగిన ఎండ

  • కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఎండ తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది.

Updated Date - Feb 24 , 2025 | 04:20 AM