Share News

Tobacco: సెప్టెంబరు వరకు హెచ్‌డీ పొగాకు కొనుగోలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:18 AM

2024 రబీ సీజన్‌లో పండిన హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని మార్క్‌ఫెడ్‌ ఇన్‌చార్జి ఎండీ డిల్లీరావు తెలిపారు.

Tobacco: సెప్టెంబరు వరకు హెచ్‌డీ పొగాకు కొనుగోలు

  • సీఎం యాప్‌లో నమోదు చేసుకున్న రైతులే అమ్మకానికి అర్హులు

అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): 2024 రబీ సీజన్‌లో పండిన హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని మార్క్‌ఫెడ్‌ ఇన్‌చార్జి ఎండీ డిల్లీరావు తెలిపారు. ఇందుకోసం రైతులు సీఎంయా్‌పలో వివరాలు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పొగాకు అమ్ముకోవటానికి అర్హులని చెప్పారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 11 కేంద్రాల్లో బర్లీ పొగాకు కొనుగోలు జరుగుతోందని, ఇప్పటి వరకు రూ.17.20 కోట్ల విలువైన 2,088 టన్నుల పరిమాణం కల ,2245 బేళ్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 04:18 AM