Remand: పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:51 AM
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు.

పల్నాడు జిల్లా: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ (YSRCP social media activist)గా పని చేస్తున్న పాలేటీ కృష్ణవేణి (Paleti Krishnaveni)కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ (14 days Remand) విదించింది. దీంతో ఆమెను పోలీసులు (Police) గుంటూరు జిల్లా (Guntur Dist.) జైలు (Jail)కు తరలించారు. మంద కృష్ణ మాదిగను అవమానించారంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , మంత్రి నారా లోకేష్‌లపై కృష్ణవేణి పోస్టులు పెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిను దాచేపల్లి పోలీసులు కృష్ణవేణిని అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణవేణిని ఈ మేరకు జైలుకు తరలించారు.
Also Read..: పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..
కాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆమెను పల్నాడు జిల్లా, దాచేపల్లికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీఏ నాయకులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో పాలేటి కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణవేణి స్వగ్రామం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి. ఏపీలోని అధికార కూటమి నేతల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని కృష్ణవేణిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గడంలేదు.
అరెస్టు చేసిన కృష్ణవేణిని దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే స్టేషన్‌కు వైసీపికి చెందినవారు ఎవరూ రాకుండా పీఎస్ మెయిన్ గేటుకు పోలీసులు బేడీలు వేసి తాళం వేశారు. ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి
11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..
For More AP News and Telugu News