Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:57 PM
ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.

పల్నాడు జిల్లా: దాచేపల్లి పోలీస్ స్టేషన్ (Dachepalli Police Station)కు బేడీలు వేశారు. పీఎస్ మెయిన్ గేటుకు పోలీసులు బేడీలు వేసి తాళం (Police lock) వేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ( YSRCP social media activist) పాలేటి కృష్ణవేణిని (Paleti Krishnaveni) దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్ స్టేషన్‌లోకి ఎవరు రాకుండా స్టేషన్ గేట్‌కు పోలీసులు తాళాలు వేశారు. ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ( Kasu Mahesh Reddy) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు. డీజీపీ (DGP) దీనిపై ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని.. ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందోనని కాసు మహేష్ రెడ్డి అన్నారు.
Also Read..: పవన్ కల్యాణ్‌పై రోజా కామెంట్స్...
కాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆమెను పల్నాడు జిల్లా, దాచేపల్లికి తరలించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎన్‌డీఏ నాయకులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో పాలేటి కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణవేణి స్వగ్రామం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి. ఏపీలోని అధికార కూటమి నేతల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని కృష్ణవేణిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గడంలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
దఢ పుట్టిస్తున్న బంగారం ధరలు..
Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా
సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
For More AP News and Telugu News