Dhulipalla: పీఎస్సార్.. వైఎస్సార్ ఆంజనేయులుగా వ్యవహరించారు..
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:20 PM
పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఏసీబీ డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.

అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ డీజీ (ex-intelligence DG) పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)పై తెలుగుదేశం సీనియర్ నేత (TDP Leader) ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంజనేయులు అధికార అహంకారంతో ‘వైఎస్‌ఆర్ ఆంజనేయులు’గా వ్యవహరించారన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు.. చట్టానికెవరూ అతీతులు కారనేందుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో ఏసీబీ డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించిన తీరు చూసామన్నారు. తన అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించి ఎంతో మందిని బెదిరించి, తనకున్న అధికార పరిధిని దాటి అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు.
Also Read..: ఇంటర్ ఫలితాలు విడుదల..
ఎంతోమంది మహిళల కన్నీటికి పీఎస్ఆర్ ఆంజనేయులు కారకుడని, రాష్ట్ర యువతీ యువకుల భవిష్యత్తుని అంధకారం చేసిన వ్యక్తి అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి పరీక్షా పత్రాలు అంశంలో అవకతవకలకు పాల్పడి ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాకుండా పైరవీకారులకు పెద్దపీట వేసిన దుస్థితి గత ప్రభుత్వంలో చూశామన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడిన ఒక పోలీస్ అధికారిని మొదటి సారి రాష్ట్ర ప్రజలు చూసారన్నారు. అధికార మధం.. అధికార దుర్వినియోగం చేసే అధికారులు చట్టం నుండి తప్పించుకోలేరనేది ఈ అరెస్టుతో తేటతెల్లం అయిందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
కాగా పీఎస్‌ఆర్ ఆంజనేయులను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ముంబై నటి జత్వాని కేసులో నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు..
హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం..
లిక్కర్ డాన్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు..
For More AP News and Telugu News