Share News

CM Chandrababu Aerial View Of Flood: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:50 PM

కోస్తాంధ్రపై మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో..

CM Chandrababu Aerial View Of Flood: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ
CM Chandrababu Aerial View Of Flood

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కోస్తాంధ్రపై బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తునే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. హై అలర్ట్‌లో ఉన్న అధికారులు తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు.


కాగా, సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నర్సాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం వెళ్లి పంట దెబ్బతిన్న రైతులను, నష్టపోయిన బాధితులను పరామర్శించారు.


ఇవి కూడా చదవండి...

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 04:02 PM