AP News: సంచలనం రేపుతున్న చిన్నారులపై దాడి ఘటనలు.. వీరిని ఏం చేయాలో మీరే చెప్పండి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:11 AM
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది.

అమరావతి: చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన కామాంధుల చేతుల్లో లైంగిక దాడులకు బలవుతుండగా.. మరోపక్క కుటుంబసభ్యులే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇప్పటికే బాలల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కోపంతో ఒకరు, వివాహేతర సంబంధాలతో మరొకరు ఇలా తమ పిల్లలనే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. తాజాగా పల్నాడు, ఏలూరు జిల్లాలో అలాంటి హృదయవిదారకర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
బాలికపై దాడి..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది. ఐదు రోజులుగా బాలికకు అన్నం పెట్టకుండా అట్లకాడతో కాల్చివాతలు పెట్టింది ఆ మహా ఇళ్లాలు. చిత్రహింతలకు గురై తీవ్రగాయాలతో అన్నం లేకుండా చిన్నారి పడి ఉండడాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 1098కి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బాలిక ఇంటికి చేరుకున్నారు. అయితే వారి రాకను గమనించి పాపను దాచి పెట్టే ప్రయత్నం చేసింది ఆ తల్లి. బాలిక జాడను కనిపెట్టిన అధికారులు తల్లిని, ఆమెకు సహకరించిన మరో మహిళను స్టేషన్‌కు తరలించారు. బాలికను శిశుసంక్షేమ గృహనికి చేర్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలుడిపై దాడి..
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ చిన్నారిపై మారుతండ్రి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కొన్ని నెలలుగా బాలుడిపై దాడి చేస్తున్న నిందితుడు గాయాలపై కారం చల్లి చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఒళ్లంతా వాతలు తేలి రక్తమెుచ్చేలా దాడి చేస్తున్నాడు. తాజాగా ఆదివారం ఉదయం సైతం బాలుడిపై దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. ఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకుని ఒళ్లంతా రక్తం వచ్చేలా కొట్టాడు. గాయాలపై మళ్లీ కారం చల్లాడు. తనపై దాడి చేయవద్దంటూ బాలుడు ఎంత వేడుకున్నా కనికరించలేదు. అయితే చిన్నారి పరిస్థితి చూసిన స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చిన్నారులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Tirupati: దొంగలు బాబోయ్.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారో తెలుసా..
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...