Share News

Sattenapalli: జగన్ పర్యటనలో హంగామా.. నిబంధనల ఉల్లంఘన.. కేసులు నమోదు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:29 PM

YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Sattenapalli: జగన్ పర్యటనలో హంగామా.. నిబంధనల ఉల్లంఘన.. కేసులు నమోదు..
Jagan Sattenapalli visit

Amaravati: వైఎస్ జగన్ (YS Jagan) సత్తెనపల్లి పర్యటన (Sattenapalli visit)లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలకు దిగారు. సత్తెనపల్లి వైసీపీ ఇన్చార్జ్ భార్గవరెడ్డి (Bhargava Reddy), మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasa Reddy)పై కేసులు (Cases) పెట్టారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతోపాటు డీజే ఏర్పాటు చేశారంటూ కేసులు నమోదు చేశారు. విధ్వంసం (Violence), బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు మొత్తం 7 కేసులు నమోదు చేశారు. కాగా పోలీసులను అడ్డుకుని బెదిరించిన సంఘటనలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుల (Ambati Rambabu brothers case)పై కేసు నమోదు చేశారు.


‘రఫ్ఫా, రఫ్ఫా నరికేస్తామ్’ అంటూ..

పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అని ప్లాకార్డ్ ప్రదర్శించి బెదిరించిన షేక్ బుజ్జిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గంగమ్మ తల్లి జాతరలో మాదిరిగా ‘రఫ్ఫా, రఫ్ఫా నరికేస్తామ్’ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించిన రవి తేజపై కూడా కేసు నమోదు చేశారు. వారిపై దర్యాప్తు జరిపి మారి కొన్ని సెక్షన్లు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే బీఎన్ఎస్‌లోని సెక్షన్ 352, 351 పార్ట్ 2 రెడ్ విత్ 3 (5) సెక్షన్లు కింద సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువురు మరణాలకు కారకులైన వారిపై కూడా రెండు కేసులు నమోదు చేశారు. పరామర్శకు వెళ్లి పోలీసులు విధించిన నిబంధనలు అతిక్రమించిన వ్యవహారంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఇప్పుటికే నిన్నటి ఘటనల్లో నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.


అంబటి రాంబాబుపై కేసు...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి బారికేడ్లను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతని ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు . దీంతో సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. రప్పా.. రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించడం పట్ల టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. వారి ఫిర్యాదు మేరకు ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవితేజ అనే వైసీపీ కార్యకర్త ప్లకార్డులను ప్రదర్శించినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


అడుగడుగునా అరాచకం..

జగన్ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. ఏడాది కిందట.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని జగన్‌ ఇప్పుడు పరామర్శించారు. అందుకోసం వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో రెంటపాళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రతీ చోట వైసీపీ మూకలు వీరంగం సృష్టిస్తూనే ఉన్నాయి. జగన్‌ పర్యటనకు వందమందికి మాత్రమే అనుమతని పోలీసులు చెప్పినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. అంతేకాకుండా వివాదస్పద ప్లకార్డులను ప్రదర్శించారు. చంపుతాం, నరుకుతామంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వీరంగం సృష్టించారు.


ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 19 , 2025 | 01:29 PM