Birthday Celebrations: టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:57 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్బంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిలో ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆఫీసు వద్దకు చేరుకుని కేక కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) 75వ పుట్టినరోజు (75th Birthday) సందర్బంగా మంగళగిరి (Mangalagiri)లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో (TDP Office) చంద్రబాబు జన్మదిన వేడుకలు (Celebrations)ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం ముందు 75 కిలోల కేక్ (75 kg cake) కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao), మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu), వర్ల రామయ్య (Varla Ramaiah), అశోక్ బాబు (Ashok Babu), టీడీ జనార్ధన్ (TD Janardhan), బూరగడ్డ వేదవ్యాస్ (Buragadda Vedvyas), నన్నపనేని రాజకుమారి (Nannapaneni Rajakumari) తదితరులు పాల్గొన్నారు.
Also Read..: ఏపీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
చంద్రబాబు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని.. ఆయన విజయాలకు పొంగిపోలేదని.. అపజయాలకు కుంకుంగిపోలేదని అన్నారు. అధికారం ప్రజలకు సేవ చేసేందుకేననని నమ్మిన నేత చంద్రబాబు అని,‘చంద్రబాబు P4’ కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణలో, అంకిత భావంలో, భవిష్యత్తు కార్యాచరణలో, సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకే చంద్రబాబు ఆదర్శమని అన్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని.. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ..
నిరంతర అనితర యోఢుదు చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మనం నడవాలని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పిలుపిచ్చారు. టీడీపీ నేత రమణ మాట్లాడుతూ.. 1984 నుంచి చంద్రబాబుతో నడుస్తున్నానుని...ఆయన నిరంతర పోరాటయోధుడని అన్నారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ఇస్తే, చంద్రబాబు తెలుగుజాతికి ఆత్మ విశ్వాసాన్ని నింపారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ అశోకబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి నేతలు, కార్యకర్తలు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపిచ్చారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు పెట్టిన విజన్ 2020 ఇవాళ వాస్తవరూపంలోకి వచ్చిందని.. చంద్రబాబు విజన్ 2047 కూడా అలానే వాస్తవరూపంలోకి వస్తుందని పల్లా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫోటో ఎగ్జిబిషన్..
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను టీడీపీ నేతలు సందర్శించారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా పని చేసిన సమయంలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్..
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మా విజనరీ లీడర్ నారా నాయుడు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాత్రి పగలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి సంపూర్ణ ఆయుష్షును, ఆనందాన్ని ఇవ్వాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ‘ప్రజలే చంద్రబాబు బలం... ప్రజల కోసమే ఆయన జీవితం.. నవనిర్మాణ దీక్ష దక్షుడు... అమరావతి రూపశిల్పి చంద్రబాబు’ అని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన చేయాలని చంద్రబాబు పెట్టుకున్న సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నానని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయకత్వంలో ఎక్కువ పర్యాయాల పాటు ప్రజలకు సేవలు అందించాలని భావిస్తున్నానని అన్నారు. అలుపెరగని శ్రామికుడైన చంద్రబాబు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశిస్తున్నానని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుజరాత్ పర్యటనకు నారాయణ బృందం..
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
For More AP News and Telugu News