Share News

Exam Paper Leak: పరీక్ష పేపర్ లీక్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం..

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:17 PM

Exam Paper Leak: రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతోన్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో పరీక్ష పత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే.. సదరు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు కొంత ఆందోొళనకు గురయ్యరు. ఇక ఈ అంశంపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. తమకు ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.

Exam Paper Leak: పరీక్ష పేపర్ లీక్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం..

అమరావతి, మార్చి 07: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు ఈ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుంటూరు జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యమే ఈ ప్రశ్న పత్రం లీక్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షను నిర్వహించారు. అయితే అరగంట ముందే ఈ పరీక్ష పత్రం లీక్ అవడం గమనార్హం. మరోవైపు మార్చి 6వ తేదీ నుంచి బీఎడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనాయి.తొలిరోజే.. ఈ ప్రశ్న పత్రం లీక్ అయిందని విమర్శలు వెల్లువెత్తాయి.ఇంకోవైపు ఈ పరీక్షల నిర్వహణపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

ఇక గతంలో యూనివర్శిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్‌కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. కానీ ఈ సారి మాత్రం ప్రశ్నాపత్రాలను కాలేజీలకు సీడీల్లో పంపించారు. అరగంట ముందు సీడీ పాస్ వార్డ్‌లు యాజమాన్యాలకు పంపిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రాల విషయంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. యాజమాన్యాలకు పాస్ వార్డ్ రాగానే ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు పంపిస్తున్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 05:42 PM