AP Liquor Scam: ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాలంటూ మద్యం స్కాం నిందితులకు హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:26 PM
ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది.
అమరావతి, నవంబర్ 19: ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది. అందుకు పాక్షికంగా హైకోర్టు అనుమతించింది. నవంబర్ 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని వారికి స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకొనేందుకు వారికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఉత్తర్వులతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు ఈ దర్యాప్తులో తెలింది. ఈ స్కాంలో భారీగా అరెస్టులు జరిగాయి. ఈ స్కాంలో భారీగా నగదు పొందిన కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి.. హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టాడు. వాటిని సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఇక ఈ విచారణలో అతడు వెల్లడించిన అంశాలు ఆధారంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఏ 31గా ధనుంజయ్ రెడ్డి, ఏ 32గా కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఏ 33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మావోయిస్టులకు రిమాండ్ విధించిన కోర్టు..
మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు
Read Latest AP News And Telugu News