GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:54 PM
GV Reddy Resignation: ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో ఇటీవల చైర్మన్, ఎండీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎండీ, చైర్మన్‌ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారినట్లు లేదు. ఈ నేపథ్యంలోనే జీవీరెడ్డి తన పదవీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

అమరావతి: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈవివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. అధికారులతో కలిసి పని చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు
YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News