Share News

Govt Employees : ఉద్యోగులకు 25 వేల కోట్ల బకాయిలు!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:34 AM

రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు.

Govt Employees : ఉద్యోగులకు 25 వేల కోట్ల బకాయిలు!

  • తక్షణమే ఒక డీఏ ప్రకటించాలి.. కేఆర్‌ సూర్యనారాయణ

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు. సంఘం కాకినాడ జిల్లా మూడో కౌన్సిల్‌ సమావేశాన్ని ఆదివారం కాకినాడలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఉద్యోగులకు రూ.6,500 కోట్ల వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని, ఇవే కాకుండా ఇంకా వివిధ రకాల బెనిఫిట్లు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నందువల్ల బకాయిపడిన మూడు డీఏల్లో ఒకటి ప్రకటించి ఉద్యోగుల్లో ఆశలు చిగురింపచేయాలని కోరారు. ప్రతినెలా వేతనం ఇచ్చేలా చెల్లింపులపై చట్టబద్ధత చేయాలని, తమ సమస్యలపై ఉన్నతస్థాయి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమే్‌షకుమార్‌, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:34 AM