MLA Ganta Srinnivasa Rao: విశాఖకు గూగుల్ పెద్ద గేమ్ ఛేంజర్..
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:13 PM
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్నారు. ఆంధ్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందన్నారు.
- ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
తిరుమల: విశాఖపట్నంకు గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinnivasa Rao) అన్నారు. సినీనటులు శ్రీకాంత్, అశోక్‌తో కలిసి శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ... గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్(Hyderabad)కు వచ్చినప్పుడు అద్భుతమైన మార్పులు జరిగాయని గుర్తు చేశారు. సైబరాబాద్ వంటి నగరం ఏర్పాటు కావడంలో మైక్రోసాఫ్ట్ కీలకంగా వ్యవహరించిందన్నారు.

ఇదే తరహాలో గూగుల్ రాకతో విశాఖపట్నం కూడా ప్రపంచగుర్తింపు నగరంగా అభివృద్ధి చెందబోతోందన్నారు. రిలయన్స్, టీసీఎస్ వంటి అనేక సంస్థలు విశాఖవైపు చూస్తున్నాయన్నారు. కాగా, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News