APSRTC: ఆర్టీసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:34 AM
ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి, సంస్థలో ప్రవేశపెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీంటినీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.

ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు
బస్టేషన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి, సంస్థలో ప్రవేశపెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీంటినీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈయూ రాష్ట్ర క మిటీ పిలుపు మేరకు శుక్రవారం నగరంలోని విజయవాడ డిపో, గవర్నరుపేట 1,2 డిపోలు, విద్యాధరపురం డిపో, విద్యాధరపురంలోని జో నల్ వర్క్‌షా్‌ప వద్ద ధర్నాలు జరిగాయి. విజయవాడ డిపో వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన ప దోన్నతులకు వెంటనే సీఎం అనుమతివ్వాలని కోరారు.
ఉచిత బస్సు పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3వేల బస్సులు కొనుగోలు చేయాలన్నారు. జోనల్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు చెల్లించాల్సిన 24 నెలల 11వ పీఆర్‌సీ అరియర్స్, డీఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శి టీవీ భవానీ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు, విధుల్లో చనిపోయిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యా్‌ష చెల్లించాలని కోరారు. రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. మరో రాష్ట్ర కార్యదర్శి ఎన్‌సీహెచ్ చక్రవర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగభదత్రపై గతంలో టీడీపీ హయాంలో ఇచ్చిన సర్క్యులర్ నెం.01/2019ను యథావిధిగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్‌కే మోహిద్దీన్ మాట్లాడుతూ ఆర్టీసీ హౌస్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఆర్టీసీ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయాన్ని తరలించాలన్న ఆలోచనను ఉన్నతాధికారులు విరమించుకోవాలని కోరారు. ఆయా డిపోల వద్ద జరిగిన ధర్నాల్లో డిపోల సెక్రటరీలు, కమిటీల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.