Share News

TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:03 AM

అమెరికాలోని ప్రముఖ ఫెడరల్‌ సంస్థ ‘ఫ్యానీ మే’ లో తెలుగు ఉద్యోగులపై అక్రమాల ఆరోపణలతో 700 మందిని తొలగించారు. ‘తానా’, ‘ఆటా’ Telugu సంఘాలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేసినట్లు సంస్థ వెల్లడించింది

 TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

  • 700 మంది ఉద్యోగులను తొలగించిన ‘ఫ్యానీ మే’ సంస్థ

  • తానా సహా ఇతర తెలుగు సంఘాలతో ఉద్యోగుల కుమ్మక్కు

విజయవాడ, ఏప్రిల్‌ 8: అమెరికాలోని తెలుగు సంఘాలపై అక్రమాల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ కంపెనీ ‘ఫ్యానీ మే’ గత రెండు రోజుల్లో 700మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 200 మందిని ‘నైతిక’ కారణాలతో తొలగించినట్టు సంస్థ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వీరిలో ఎక్కువమంది తెలుగు వారే ఉన్నట్టు తెలిసింది. సంస్థ పేర్కొన్న వివరాలను బట్టి.. కొందరు ఉద్యోగులు ‘మ్యాచింగ్‌ గ్రాంట్‌’ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. మరికొందరు దుర్వినియోగం చేశారు. ఇంకొంత మంది ఉద్యోగులు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సహా మరికొన్ని సంఘాలతో కుమ్మక్కయి కంపెనీని మోసం చేశారని సంస్థ ఆరోపించింది. మంగళవారం ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఒకరు తానా ప్రాంతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. మరొకరు.. అమెరికా తెలుగు సంఘం (ఆటా) మాజీ అధ్యక్షుని జీవిత భాగస్వామి. కాగా, తమ సంస్థను మోసం చేసిన వాటిలో తానా ఒక్కటే లేదని.. ఇతర సంస్థలు కూడా ఉన్నాయని ‘ఫ్యానీ మే’ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 09 , 2025 | 05:04 AM