Train Accident Averted: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:59 AM
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది. పలాస రైల్వే స్టేషన్‌కు సమీపంలో బఫర్ విరిగిపోవడంతో రైలు 15 బోగీలతో నిలిచిపోయింది, ఈ ఘటనలో మూడు గంటల పాటు రైలు ఆలస్యం అయింది

బఫర్ విరిగి పట్టాలపై నిలిచిన బోగీలు
భువనేశ్వర్ వైపు రైళ్లు మూడు గంటలు ఆలస్యం
పలాస, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఫలక్‌నుమా(12704) ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో సున్నాదేవి ఎల్‌సీ గేటు వద్ద ఉదయం 7.15 గంటల సమయంలో రైలు ఎనిమిదో బోగీ ఏసీ కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న బఫర్ విరిగి తెగిపోవడంతో 15 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. ఇంజన్‌తో ఉన్న 8 బోగీలు ముందుకెళ్లిపోయాయి. ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగినట్టు గార్డ్ మధుకుమార్ భావించారు. దిగి పరిశీలించగా బోగీలు విడిపోయి ఉండటంతో పాటు, మిగిలిన బోగీలతో రైలు వెళ్లిపోవడాన్ని గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి మందస వద్ద రైలును నిలుపుదల చేశారు. అనంతరం పలాస రైల్వే అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బఫర్ విరిగిపోయినట్టు గుర్తించారు. అనంతరం ఇంజన్‌ను బోగీలు నిలిచిపోయిన ప్రాంతానికి తీసుకువచ్చి రైలును మందసకు తరలించారు. ప్రమాదానికి కారణమైన 8వ బోగీని అక్కడ వదిలేసి, అందులో ఉన్న 42 మంది ప్రయాణికులను వేరే బోగీల్లోకి సర్దుబాటు చేసి గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటన కారణంగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ మందసలో 3 గంటల పాటు నిలిచిపోగా, దురంతో ఎక్స్‌ప్రెస్‌ను మూ డు గంటల పాటు పలాసలో నిలిపివేశారు. దీంతోపాటు భువనేశ్వర్ వైపు వెళ్లే రైళ్లన్నీ మూడు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News