Pawan Kalyan: పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది..
ABN , Publish Date - Jun 20 , 2025 | 07:41 AM
Road Accident: కాకినాడ జిల్లా, పిఠాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు.

Amaravati: పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని విరవ గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం (Road Accident)పై ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన తనను బాధ కలిగించిందని అన్నారు. ఆటో (Auto), వ్యాన్ (Van) ఢీ కొన్న ప్రమాదంపై జిల్లా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
కాగా కాకినాడ జిల్లా, పిఠాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామం, పీహెచ్‌సీ సమీపంలో ఆటో, వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాల్దారి రాజబాబు అక్కడికక్కడే మృతి చెందారు. గాలింక కన్నబాబు, చిన్నబాబులను కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కాల్దారి రమేష్ చికిత్స పొందుతున్నారు. వీరంతా మల్లాం గ్రామంలో ఓ శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన రోజున మారిన రాహుల్ చిరునామా
For More AP News and Telugu News