AP News: ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:59 AM
ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు.పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడు ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని వర్మ పేర్కొన్నారు.

కాకినాడ: ఎమ్మెల్సీ పదవి (MLC Position)పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే (Pithapuram Former MLA) వర్మ కామెంట్స్ (Varma Comments) చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాకినాడ (Kakinada)లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు (CM Chandrababu)తో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడు ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సమీకరణాల వలన ఈసారి పదవి ఇవ్వలేకపోయి వుండొచ్చునని.. పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని.. ఈ అవకాశమే తనకు పెద్ద పదవి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎప్పుడు వుంటాయని, ఎన్నికలప్పుడు కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామని వర్మ వ్యాఖ్యానించారు.
Also Read:
ఎదురు చూపులు ఫలించలేదు..
కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కూటమి నేతలకు నిరాశ ఎదురైంది.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదురు చూపులు ఫలించలేదు.. పదవి తప్ప కుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగి లింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మ డి జిల్లాలో ఒక రెండు ఎమ్మెల్సీలు లభిస్తాయని అంతా ఊహించినా లెక్కతప్పింది. అధిష్ఠానం ఒక్కటీ కేటాయించలేదు.
పలువురికి నిరాశే..
సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాట్ల మధ్య కొందరికి టికెట్లు దక్కలేదు. అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలకు ఎమ్మెల్సీ కోటాలో చూద్దామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో చాలా మంది ఎదురు చూశారు. కానీ రాష్ట్రంలో కేవలం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఖాళీ అవ్వడం వల్ల తెలుగుదేశం 3, జనసేన 1, బీజేపీకి 1 కేటాయించారు. దీని వల్ల ఆశావహులకు అవకాశం రాలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెఎస్ జవహర్‌కు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇక కోనసీమ నుంచి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పదవి ఆశించారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆశించే వారి సంఖ్య బాగా పెరడంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. సర్దుబాట్ల వల్ల పలువురు ఎమ్మెల్సీ ఆశలు నీరుగారిపోయాయి.ఈ మేరకు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడి తర్వాత ఎప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ అయినా హామీ ఇచ్చిన వారికి ఇస్తామని చెప్పాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు నేతలకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. 2027లో ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని..అప్పుడు మీకు కచ్చితంగా స్థానం కల్పిస్తామని స్వయంగా సీఎం చంద్ర బాబు చెప్పమన్నారని చెప్పడం గమనార్హం.
యనమలకు కీలక పదవి..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవి కాలం ఈనెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎమ్మెల్సీని ఆశించినా దక్కలేదని సమాచారం. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీడీపీలో కీలకనేతగా ఉన్న యనమలకు త్వరలోనే మరో కీలక పదవి రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని లేదా గవర్నర్ పదవి లభిస్తుందనే ప్రచారం ఉంది. తుని నియోజకవర్గం పరిధిలోని తేటగుంటలో హైవే సమీపంలో తోటలోని ఆయన ఇంటివద్ద ఇటీవల పెద్ద గేటు నిర్మిస్తుండడంతో పాటు, గేటు సమీపంలో బంకర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో కీలక పదవి రాబోతుందనే ప్రచారం ఊపందుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శంషాబాద్‌లో తప్పిన ఘోర ప్రమాదం
బోరుగడ్డ కేసు.. క్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు
జనసేన నేత పార్టీ నుంచి సస్పెండ్..
Read Latest Telangana News and National News