Ananthapuram News: ధర్మవరం కుర్రాడు అదుర్స్ బాబోయ్...
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:17 AM
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభను చాటాడు.
- అంతర్జాతీయ చెస్ టైటిల్ కైవసం
అనంతపురం: ధర్మవరానికి(Dharmavaram) చెందిన సహృద్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటాడు. ఏకంగా టైటిల్నే కైవసం చేసుకున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. విజయవాడ(Vijayawada)లో రెండు రోజులపాటు నిర్వహించిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో 800 మందికిపైగా క్రీడాకారులు పోటీపడ్డారు. అందులో సహృద్ 1800బి రేటింగ్ విభాగంలో 9 రౌండ్లకుగాను ఎనిమిదింటిలో గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. సహృద్ను చీఫ్ కోచ్ ఆదిరత్న కుమార్ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News