Tirupati Trust Donations: స్వామీ.. నా సర్వస్వం నీకే!
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:27 AM
శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్నారు ఓ రిటైర్డు అధికారి...

రూ.3 కోట్ల ఇల్లు, రూ.66లక్షల నగదు
మాజీ ఐఆర్‌ఎస్ భాస్కర్‌రావు వీలునామా
టీటీడీకి పత్రాలను అందజేసిన ట్రస్టీలు
తిరుమల: శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్నారు ఓ రిటైర్డు అధికారి. తన మరణానంతరం ఇంటితో పాటు బ్యాంకు ఖాతాలోని సొమ్ము యావత్తూ స్వామివారికే చెందాలని హైదరాబాద్‌కు చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వైవీఎ్‌సఎస్ భాస్కర్‌రావు వీలునామా రాశారు. ఆరు నెలల కిందట ఆయన కన్నుమూయడంతో.. ఆయన కోరిక మేరకు ఆయన ట్రస్టీలు రూ.3 కోట్ల విలువైన ఇంటి పత్రాలు, రూ.66 లక్షల విరాళాన్ని గురువారం రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ట్రస్టీలు దేవరాజ్‌రెడ్డి, సత్యనారాయణ, లోకనాథ్ అందజేశారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో 3,500 చదరపు అడుగుల స్థలంలో ఉన్న ‘ఆనందనిలయం’ భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలని వీలునామాలో పేర్కొన్నారు. అలాగే, తన బ్యాంకు ఖాతాలో దాచిన సొమ్ములో టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, ఎస్వీ సర్వశ్రేయ, వేదపరిరక్షణ, గోసంరక్షణ, విద్యాదానం, శ్రీవాణి ట్రస్టులకు రూ.6 లక్షల చొప్పున ఇవ్వాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News