Share News

Polavaram Project Delay: యంత్రసామగ్రి తరలింపులో బావర్‌ జాప్యం

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:11 AM

పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులను లక్ష్యాల మేరకు పూర్తిచేస్తారా.. కీలకమైన డయాఫ్రం వాల్‌ డిసెంబరుకల్లా ..

Polavaram Project Delay: యంత్రసామగ్రి తరలింపులో బావర్‌ జాప్యం
Polavaram Project Delay

  • డిసెంబరుకల్లా ‘వాల్‌’ పూర్తవుతుందా.. నేడు కేంద్ర జలశక్తి కార్యదర్శి సమీక్ష

అమరావతి జూలై 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులను లక్ష్యాల మేరకు పూర్తిచేస్తారా.. కీలకమైన డయాఫ్రం వాల్‌ డిసెంబరుకల్లా పూర్తవుతుందా అనే అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ శుక్రవారం ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో, వాప్కోస్‌ సీఎండీ, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ డైరెక్టర్‌, జలసంఘం చీఫ్‌ ఇంజనీర్‌, జలవనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొంటారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి యంత్రసామగ్రిని సమకూర్చుకోవడంలో బావర్‌ సంస్థ వెనుకబడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యంత్రసామగ్రిని, కట్టర్‌లను 4 నెలలు ఆలస్యంగా ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చిందని.. ఈ కారణంగా 129 రోజుల పాటు పనులు ఆగిపోయాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై వాప్కోస్‌, సీడబ్ల్యూఎంఆర్‌ఎ్‌సల నుంచి దేబర్షి సమాచారం సేకరిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 05:11 AM