Share News

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

ABN , Publish Date - Feb 06 , 2025 | 12:53 PM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

గుంతకల్లు(అనంతపురం): దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది. ఈ డివిజన్‌లోని రాయచూరు-నాల్వార్‌ రైల్వే సెక్షన్‌ను సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోకి (సౌత్‌ సెంట్రల్‌) మారుస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులను జారీచేసింది. రాయచూరు-నాల్వార్‌ సెక్షన్‌(Raichur-Nalwar section)కు గుంతకల్లు డివిజన్‌లో 107.58 కి.మీ. లైన్‌, 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: మహా కుంభమేళాకు గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు..


దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌లోకి గుంతకల్లు రైల్వే డివిజన్‌ మారనున్న నేపథ్యంలో పరిపాలన, నిర్వహణ సౌలభ్యం కోసం రాయచూరు-నాల్వార్‌ మార్గాన్ని ఎస్‌సీ రైల్వేలోకి మార్చాలని నిర్ణయించారు. గతంలో గుంటూరు రైల్వే డివిజన్‌, హుబ్లీ డివిజన్ల ఏర్పాటు సందర్భంగా కూడా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత వేశారు. పలు రైల్వే సెక్షన్లను ఆ డివిజన్లలోకి మార్చారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌, విజయవాడ తర్వాత పెద్ద విస్తీర్ణం కలిగిన మూడో డివిజన్‌గా ఉండేది.


pandu2.1.jpg

ప్రస్తుతం సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌లోకి మారినందున విజయవాడ తర్వాత రెండో పెద్ద డివిజన్‌గా మారింది. రాయచూరు-వాడి రైల్వే సెక్షన్‌లో రెండు పవర్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఉన్నందున బొగ్గు రవాణాకు ఈ సెక్షన్‌ మూడు రైల్వే జోన్‌లకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ కారణంగా మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే జోన్లలో వాడి జంక్షన్‌ అత్యంత కీలకం కానుంది. పరిపాలన, నిర్వహణ సౌలభ్యం కోసం వాడి జంక్షన్‌ను క్రూ చేంజింగ్‌ పాయింట్‌గా రైల్వేశాఖ గుర్తించింది.


లాభాలూ ఉన్నాయ్‌..

జోన్‌ మార్పు కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ కుదింపునకు గురైంది. ఆదాయ పరంగా నష్టం, జోనల్‌ కేంద్రం దూరంగా ఉండటం ఇబ్బందికరమే అయినా, కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌ ఏర్పాటు వల్ల విశాఖపట్టణం-విజయవాడ-గుంతకల్లు రైల్వే డివిజన్ల మధ్య కనెక్టివిటీ, ట్రాఫిక్‌ పెరుగుతుంది. దీని వల్ల రాష్ట్ర రాజధానికి రైళ్లు లేక ఇబ్బందిపడుతున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ ప్రయాణికులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మేలు జరగనుంది. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు అమరావతి, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మినహా డెయిలీ ఎక్స్‌ప్రెస్‏లు లేక ఇబ్బందులు పడుతున్న సీమ ప్రజలకు కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయి. గతంలో రద్దయిన యశ్వంతపూర్‌-విజయవాడ ప్యాసింజరుతోపాటు, మరిన్ని రైళ్లు వచ్చే పరిస్థితులు ఏర్పడుతాయి.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 12:53 PM