Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ విచారణ
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:15 PM
Posani : ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టుకు సీఐడీ కోరనుంది.

గుంటూరు, మార్చి 18: గతంలో ప్రతిపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి కస్టడీలోకి తీసుకుని చేపట్టిన విచారణ పూర్తయింది. దాదాపు నాలుగు గంటలపాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో పోసానిని హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అయితే పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం విధితమే.
గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే పోసాని కృష్ణమురళి వివిధ సమయాల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌తోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లలో పోసానిపై పలువురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Dana Nagender serious statement: నేను సీనియర్‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
Arrest: యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం
For Andhrapradesh News And Telugu news