Share News

Buddha Venkanna: రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యం

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:09 AM

రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు...

Buddha Venkanna: రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యం

  • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న

విద్యాధరపురం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం 39వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు కే శివశర్మ ఆధ్వర్యంలో విద్యాధరపురం, పెరుమాళ్ల కుటుంబరావు వీధి, బాలాజీ ఆశ్రమం రోడ్డు తదితర ప్రాంతాల్లో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగులో బుద్దా వెంకన్న పాల్గొని ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి స్థానికులకు వివరించారు.


సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ రాష్ర్టానికి కొత్త పరిశ్రమలు తీసుకురావటానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ గుండారపు హరిబాబు, నేతలు బడుగు గణేష్‌, ఎం వీరబాబు, ఆర్‌ రవికుమార్‌, ఎన్‌ వీర్రాజు, ఆర్‌ సురేష్‌, ఆర్‌ విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 05:09 AM