Venkatavinay: ఏకసంథాగ్రాహి..
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:01 PM
Venkatavinay: వేంపల్లె శ్రీరామ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు, గంగాదేవి కుమారుడు వలసగారి వెంకటవినయ్. అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదు వుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా రాణిస్తున్నాడు. ప్రధానంగా చెస్‌లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులతో పోటీపడి గెలవగలిగే సత్తా తెచ్చుకున్నాడు.

ఒకసారి వింటే చాలు..
అనర్గళంగా ఇంగ్లీష్, తెలుగు పాఠ్యాంశాలను అప్పజెబుతున్న విద్యార్థి
పేజీ నంబర్ చెబితే పాఠ్యాంశమంతా వివరణ
చెస్‌లోనూ ప్రతిభ చూపుతున్న బాలుడు
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మట్టిలో మాణిక్యం.. వెంకటవినయ్
వేంపల్లె, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఈ బాలుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాధారణ విద్యార్థి. తల్లిదండ్రులూ చదువుకోలేదు. కూలినాలి చేసుకొని జీవించే కుటుంబం. కానీ ఆ విద్యార్థి ప్రతిభ తరగతికి మించి ఉంటుంది. సాధారణంగా తరగతిలోని పాఠ్యాంశాల్లో ప్రశ్నకు జవాబులు నేర్చుకుంటారు. కానీ ఆ పాఠ్యాంశాల్లోని ప్రతి అక్ష రాన్ని మెదడులో ఉంచుకోలిగిన మేథస్సు ఈ బా లుడిలో ఉంది. పేజీ నెంబర్ చెబితే చాలు అందు లో ఉన్న పాఠ్యాంశాన్ని చూడకుండా చెప్పగలిగే ప్రతిభావంతుడు. చదువుతో పాటు ఆటల్లోను తన ప్రతిభ చూపుతున్నాడు. చెస్‌లో పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడిపైనే గెలిచే సత్తా సాధించాడు. ఇది వేంపల్లెలోని శ్రీరామ్‌నగర్ ప్రాథ మిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వలసగారి వెంకటవినయ్ ప్రతిభకు తార్కానం. పిట్ట కొంచెం.. కూత ఘనం నానుడికి చక్కగా సరిపోయే రూపం వెంకటవినయ్. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం..
వయస్సుకు మించిన ప్రతిభ
వేంపల్లె శ్రీరామ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు, గం గాదేవి కుమారుడు వలసగారి వెంకటవినయ్. అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదు వుతున్నాడు. తమ్ముడు జగదీష్ మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి బేల్దారి కూలి కాగా తల్లి ల్యాండ్రీ చేసి జీవించే కుటుంబం. వెంకటవినయ్ ప్రతిభను అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసే రమేష్ గుర్తించారు. మొదట పాఠం చెప్పిన వెం టనే నేర్చుకొని అప్పజెప్పేవాడు. ఆ బాలుడిపై ప్రత్యేక దృష్టిసారించి మరింత లోతుగా బోధన చేయడంతో ఇంగ్లీష్‌లోని 8పాఠ్యాంశాలను, తెలు గులోని 10 పాఠ్యాంశాలను అనర్గళంగా చెప్పగలి గేంత స్థాయికి చేరుకున్నాడు. మిగతా విద్యార్థులం దరు అందులోని ప్రశ్నలకు జవాబులు చెబుతుం డగా, వెంటకవినయ్ తన వయసుకు మించి ప్రతిభ చూపుతున్నాడు. పుస్తకాల్లోని పేజీ నెంబర్ చెబితే చాలు.. అందులో ఉన్న పాఠ్యాంశాన్ని చూ డకుండా చెప్పగలుగుతున్నాడు. ఇక చేతిరాతను అందంగా రాస్తున్నాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా రాణిస్తున్నాడు. ప్రధానంగా చెస్‌లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులతో పోటీపడి గెలవగలిగే సత్తా తెచ్చుకున్నాడు.
పేదరికం అడ్డుకారాదు
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వలసగారి వెంకటవినయ్ ఎంతో ప్రతిభావంతుడుగా ఉన్నా డు. ఈ ప్రతిభ ఇలాగే కొనసాగాలంటే పైచదువు లకు వెళ్లేసరికి ఆర్థికభారం పడుతుంది. అతని కు టుంబం పేద కుటుంబం కాబట్టి దాతలు ముం దుకొచ్చి చదువుకునేందుకు చేయూతనిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నది ఇక్కడి ఉపాధ్యాయుల ఆకాంక్ష. మట్టిలో మాణిక్యం లాంటి ఈ విద్యార్థికి మంచి భవిష్యత్తు అందాలని ఆకాంక్షిద్దాం.
కలెక్టర్ కావడమే లక్ష్యం..
నాపేరు వలసగారి వెంకటవినయ్. శ్రీరామ్ నగర్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతు న్నాను. ఉపాధ్యాయుల సహకారంతో పాఠ్యాంశాల్లో ఎక్కడి నుంచైనా చెప్పగలను. భవిష్యత్తులో కలెక్టరై దేశానికి సేవ చేయడమే నా లక్ష్యం.
ప్రత్యేక దృష్టితో బోధన చేశాం..
చెప్పిన పాఠాలు చెప్పినట్లే వెంటనే అప్పజెప్పేవాడు. నాల్గో తరగతి వరకు ఇలా బోధన సాగింది. ఐదో తరగతిలో ప్రత్యేక దృష్టి సారించి విద్యాబుద్దులు నేర్పించాం. తెలుగు, ఇంగ్లీష్ పాఠ్యాంశాలన్నీ చూడకుండా చెప్పగలుగుతున్నాడు. చెస్‌లోనూ రా ణిస్తున్నాడు. ఈ విద్యార్థి చదువు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
- రమేష్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, శ్రీరామ్‌నగర్, వేంపల్లె
ఈ వార్తలు కూడా చదవండి...
Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్
Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్ పొడిగింపు
High Court: ఏబీవీ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
For More AP News and Telugu News