Share News

TTD Goshala Controversy: ఆ గోశాలలో జరిగిందంతా కామెడీ షో

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:14 PM

TTD Goshala Controversy: ఎస్వీ గోశాలలో జరిగింది అంతా ఒక కామెడీ షో‌‌ అంటూ భూమన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదన్నారు. పది నెలల కాలంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని.. హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు.

TTD Goshala Controversy: ఆ గోశాలలో జరిగిందంతా కామెడీ షో
TTD Goshala Controversy

తిరుపతి, ఏప్రిల్ 17: టీటీడీ గోశాలకు రావాలని సవాల్ విసిరిన వెంటనే తాను సిద్ధమంటూ చాలెంజ్ స్వీకరించానని.. కానీ తనతో వైసీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Former TTD Chairman Bhumana Karunaka Reddy) మండిపడ్డారు. యాభై మందికిపైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారన్నారు. నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఎస్పీతోనే అబద్దాలు చెప్పించారని.. గోశాలకు వెళ్ళనీయకుండా అడుగడుగునా అడ్డుకున్నారని అన్నారు. ‘నాకు ఫోన్ చేసి గోశాలకు రావాలని ఎమ్మెల్యేలు కోరారు‌‌‌‌‌.. వస్తానని చెప్పాను‌. నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ రాకుండా తోకముడిచారు‌’ అంటూ ఎద్దేవా చేశారు.


ఇవాళ ఎస్వీ గోశాలలో జరిగింది అంతా ఒక కామెడీ షో‌‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదన్నారు. పది నెలల కాలంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని.. హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు. డెబ్బై సంవత్సరాల తరువాత కొండపై డ్రైవర్లు కొట్టుకుని ఒకరిని హత్య చేశారని.. కొందరు భక్తులు తిరుమలలో బిర్యానీలు తిన్నారని, మద్యం, గంజాయి సులువుగా దొరుకుతోందని వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అన్ని సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. సవాల్ విసిరి అరెస్టు చేస్తారని... డ్రామాలు ఆడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు దగ్గర నుంచి అందరూ అబద్దాలు చెబుతున్నారన్నారు.

Harassment On Minors: తెలంగాణలో దారుణం.. చిన్నారులపై


టీటీడీ గోశాలలో 170 ఆవులు కంటే ఎక్కువ చనిపోయాయని తెలిపారు. సాధువులు, స్వామీజీతో కలసి గోశాలకు రావడానికి తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోలీసుల చేత తమను ఉక్కుపాదంతో అణచివేశారని ఫైర్ అయ్యారు. నాస్తికుడు, క్రైస్తవుడు అంటూ రకరకాల విమర్శలు చేశారన్నారు. మూడు నెలలుగా తిరుమలలో జరిగిన ఘటనలపై స్పందించామని తెలిపారు. స్వామీ వారి అనుగ్రహం ఎంతో ఉంటే తాను మూడుసార్లు చైర్మన్ పనిచేసే అవకాశం వస్తుందన్నారు. టీటీడీ చరిత్రలో ఎవరూ పనిచేయని విధంగా తన పనిచేసే అవకాశం దేవుడు ఇచ్చారని చెప్పుకొచ్చారు. స్వామీ వారిలో సేవలో ఉండే వృషభం కూడా చనిపోయిందన్నారు. తాను చూపించిన ఫోటోలు అన్నీ ఓరిజినలే అని చెప్పారు. ‘ఇప్పటికి మేము సిద్దం ఉన్నాం. మీరు అనుమతి ఇస్తే వస్తాం’ అని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.


కాగా.. టీటీడీ గోశాలల్లో ఆవుల మృతి అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపించగా.. అలాంటివి ఏమీ లేదంటూ టీడీపీ నేతలు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. సవాళ్లు ప్రతిసవాళ్లలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమనకు గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా రోడ్డుపై పడుకుని మరీ డ్రామాకు తెరతీశారు. ఎలాంటి హడావుడి లేకుండా గోశాలకు వెళ్లాలని భూమనకు పోలీసులు తెలిపారు. పోలీసుల సూచలను మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. పైగా పోలీసులే తమను అడ్డుకుంటున్నారంటూ రివర్స్‌ డ్రామా ప్లే చేశారు. ఇంటి వద్ద నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.


ఇవి కూడా చదవండి

Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్

Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 03:14 PM