Tomato: టమోటా ధరలు ఆశాజనకం
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:36 AM
టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.

సోమల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.ఎండల తీవ్రతతో పాటు ఊజీ ఈగల దాడులతో, నల్లమచ్చలతో టమోటాకు తీవ్రంగా నష్టం జరిగింది.సగానికి సగం నల్లమచ్చ, ఊజీ ఈగలతో దెబ్బతిన్న కాయలు వస్తుండడంతో వాటిని మార్కెట్లలో కొనడం లేదు. వీటిని పశువులకు మేతగా వేస్తున్నారు.ఇతర జిల్లాల్లో టమోటా సాగు తగ్గిపోవడంతో సోమల, పుంగనూరు, చౌడేపల్లె, పలమనేరు తదితర ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలల్లో నాట్లు వేసిన వారికి దిగుబడులు ప్రారంభమై లాభాలు వస్తున్నాయి. సోమల మండలంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో నాటిన తోటల్లో దిగుబడులుండీ ధరలు లేక పోవడంతో నష్టాలు వచ్చాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు.ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు లేకపోవడంతో వ్యాపారస్తులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె మార్కెట్లకు రావడంతో ఽఎగుమతులు పెరిగి ధరలు పుంజుకుంటాయని రైతులు ఆశ పడుతున్నారు.ఇప్పటికే కోలారు, వడ్డిపల్లె, మొలకలచెరువు, అంగళ్లు తదితర టమోటా మార్కెట్లలో 30కిలోల బాక్సు రూ.900కు మించి ధర పలుకుతోంది.