Died: నీటమునిగిన మామా అల్లుళ్లు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:38 AM
ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.
రామకుప్పం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.పోలీసుల కథనం మేరకు వివరాలు...రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ కోటచేనుకు చెందిన గోవిందప్ప(29) కొన్నేళ్ళుగా బెంగళూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు రోజుల క్రితం బంధువుల పెళ్ళి కోసం భార్యాపిల్లలతో కోటచేనుకు వచ్చాడు. సోమవారం ఉదయం తమిళనాడులోని వాణియంబాడి సమీపంలో జరిగిన పెళ్ళికి వెళ్లి తిరుగుప్రయాణంలో చెల్లెలు కుమారుడు సతీ్‌ష(16)ను కోటచేనుకు తీసుకొచ్చాడు.ఎద్దులను శుభ్రం చేసేందుకు సమీపంలోని కుంట వద్దకు తనతో పాటు సతీ్‌షను కూడా తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో ఓ ఎద్దు వేగంగా నీటిలో పరుగు తీసింది. దాని తాడు గోవిందప్ప, సతీ్‌షల కాళ్ళకు చుట్టుకుంది. తాడును తీసే ప్రయత్నంలో వారిద్దరూ కుంట మధ్యలోకి జారిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. వారి కేకలతో చుట్టు పక్కల రైతులు కుంటలోకి దిగి గట్టుకు చేర్చేసరికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గోవిందప్పకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.ఇంటర్ చదువుతున్న సతీష్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లే్‌షయాదవ్, ఎస్‌ఐ వెంకటమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గోవిందప్ప భార్య నందిని పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.