Share News

DSC: ఆశల మెగా డీఎస్సీ వచ్చేసింది..!

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:16 AM

ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది. అధికారంలోకి వస్తే తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకుంది.

DSC: ఆశల మెగా డీఎస్సీ వచ్చేసింది..!

జూన్‌, జూలైలో పరీక్షలు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది. అధికారంలోకి వస్తే తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఏడాదిలోనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావించినా, ఎస్సీ వర్గీకరణ అడ్డురావడంతో కొంత సమయం పట్టింది. అయినా, గత ఏడాది టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) నిర్వహించి.. నవంబరులోనే ఫలితాలు విడుదల చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు జైకొట్టిన ప్రభుత్వం డీఎస్సీకీ సై చెప్పింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌ యాజమాన్యాల పాఠశాలల్లోని మొత్తం ఖాళీలు.. 1478 భర్తీ చేయనున్నారు. వీటిల్లో.. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌ యాజమాన్యాల పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ, వ్యాయామ) 1,473 పోస్టులుండగా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ (ఆశ్రమ) పాఠశాలల్లో మరో ఐదు పోస్టులు (మ్యాథ్స్‌ 1, ఫిజిక్స్‌ 1, బయాలజీ 1, ఎస్జీటీ 2) ఉన్నాయి.

షెడ్యూల్‌ ఇలా..: ఆదివారం నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరణ, ఫీజు చెల్లింపు ఉంటుంది. మే 20 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు అందుబాటులో ఉంటుంది. మే 30వ తేదీనుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ అభ్యర్థులు పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష అనంతరం రెండ్రోజుల్లో ‘కీ’ని విడుదల చేస్తారు. ఏడు రోజుల అనంతరం ఫైనల్‌ ‘కీ’ విడుదలవుతుంది. ఆ తర్వాత ఏడు రోజులకు డీఎస్సీ మెరిట్‌ (మార్క్‌ మెమో)విడుదల చేయనున్నారు.


రోస్టర్‌ వారీగా పోస్టుల వివరాలిలా..

కేటగిరీ ప్రభుత్వ, మున్సిపల్‌ మున్సిపల్‌ మొత్తం

స్థానిక కార్పొరేషన్‌

యాజమాన్యం

ఓసీ 511 26 41 578

బీసీ-ఏ 94 6 11 111

బీసీ-బీ 127 5 7 139

బీసీ-సీ 18 1 0 19

బీసీ-డీ 91 5 6 102

బీసీ-ఈ 48 2 3 53

ఎస్సీ-గ్రేడ్‌ 1 16 1 4 21

ఎస్సీ-గ్రేడ్‌ 2 84 4 6 94

ఎస్సీ-గ్రేడ్‌ 3 102 4 6 112

ఎస్టీ 85 5 5 95

ఈడబ్ల్యూఎస్‌ 125 5 8 138

పీహెచ్‌-విజువల్‌ 1 0 0 1

పీహెచ్‌-హియర్‌ 10 0 0 10

ట్రైబల్‌ వెల్ఫేర్‌

(ఆశ్రమ) 5 0 0 5

1317 64 97 1478

Updated Date - Apr 21 , 2025 | 01:16 AM