Share News

Supreme Court: బుగ్గ మఠం భూములపై పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - Jun 23 , 2025 | 01:49 PM

Supreme Court: బుగ్గమఠం భూముల వ్యవహారంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది.

Supreme Court: బుగ్గ మఠం భూములపై పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు
Peddireddy Ramachandra Reddy

Delhi: వైసీపీ కీలక నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి బుగ్గ మఠం భూముల (Bugga Matham Land)పై సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ (Petition)పై సోమవారం జస్టిస్ కేవీ. విశ్వనాధన్ (KV Vishwanathan), జస్టిస్ ఎన్‌కే. సింగ్ (Justice NK Singh) ధర్మాసనం విచారణ చేసింది. దీనికి సంబంధించి హైకోర్టునే ఆశ్రయించాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం సూచించింది. అంతవరకూ బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు యథాతధా స్థితి కొనసాగించాలని పేర్కొంది.


హైకోర్టులోనే తేల్చుకోవాలి...

సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు, బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం ఏపీ హైకోర్టు చట్ట ప్రకారం, మెరిట్స్ ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు.


ముగిసిన విచారణ..

బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్‌ కేవి విశ్వనాథన్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌పై డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకుంటుందని, కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని, హైకోర్టు మెరిట్స్‌ ఆధారంగా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సోమవారం నుంచి రెండు వారాల పాటు.. యథాతధా స్థితిని కొనసాగించాలని.. ఆ తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్చ ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ

బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..: హరీష్‌రావు

వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 01:57 PM