Kanipakam: కాణిపాకంలో ఒక్కరోజు అన్నదానానికి శ్రీకారం
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:08 AM
తిరుమల తరహాలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒక్క రోజు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం శ్రీకారం చుట్టారు.

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల తరహాలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒక్క రోజు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి రూ.1,01,123 ఖర్చు అవుతుందని తెలిపారు. ఐరాల మండల జడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు ముఖ్యమంత్రి పేరిట మొదటగా ఒక్కరోజు అన్నదాన కార్యక్రమానికి అయ్యే ఖర్చును చెక్కు రూపంలో అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, ఈవో పెంచలకిషోర్, నాయకులు మణి నాయుడు, హరిబాబు నాయుడు, మధుసూదన్‌రావు, లత, దయానంద మందడి, శేషాద్రి, పూర్ణచంద్ర, హేమాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.