Share News

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని

ABN , Publish Date - Dec 01 , 2025 | 03:59 PM

పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని
Parakamani Case

తిరుపతి, డిసెంబర్ 1: తిరుమల పరకామని చోరీ కేసులో సీఐడీ విచారణ గడువు రేపటితో పూర్తి అవుతున్న నేపథ్యంలో నిందితులు ఎవరనేది క్లియర్‌గా తెలుస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) అన్నారు. ఈరోజు (సోమవారం) తిరుపతిలో ఎన్టీఆర్ వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి చోరీ అంశాన్ని ప్రస్తావించారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీకిపోవడం చరిత్రలో జరగని, వినని విషయమన్నారు.


విచారణ పట్ల వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని అన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. సూత్రధారి, పాత్రధారి ఆయనే కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడుతారని వ్యాఖ్యలు చేశారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రర్ నియామకంలో ఆనంద్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని.. ఆ వ్యవహారంలో తప్పు ఉంటే ఐజీ, డిఐజి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కల్తీ నెయ్యి, పరకామణిలో తప్పులు చేశామని ఒప్పుకుంటూనే, తాము చేయలేదని, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని అన్నారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

స్వచ్ఛందంగానే రాజీనామా.. మండలి చైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 04:05 PM