High alert: ఢిల్లీలో పేలుడుతో హైఅలర్ట్
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:47 AM
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
తిరుపతి(నేరవిభాగం)/తిరుమల/సూళ్లూరుపేట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ విదేశాల నుంచి తిరుపతి, తిరుమలకు యాత్రికులు వస్తుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ సెల్ కాన్ఫరెన్సు ద్వారా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. తిరుపతిలో డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో సీఐలు శ్రీనివాసులు, మురళీమోహన్, రామయ్య, రాంకిషోర్‌లు, ఎస్‌ఐలు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేశారు. ఈస్ట్ పరిధిలోని దాదాపు 30 మంది, అలిపిరి పరిధిలో మరో 18 మందిని విచారించి ఫింగర్ ఫ్రింట్‌లు తీసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమలకు చేరుకున్న ప్రతి వాహనాన్ని నిలిపి లోపల తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులనుు విచారిస్తున్నారు. ఇక, షార్‌లో సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది, మెరైన పోలీసులు, కోస్టల్ గార్డ్స్‌చే శ్రీహరికోట చుట్టుప్రక్కల ఉన్న అటవీప్రాంతంలో పాటు జలమార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ బ్రహ్మనా
చిత్తూరు అర్బన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు వాహనతనిఖీలు చేపట్టారు.చిత్తూరు నగరంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్, ఇతరఅనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీచేశారు. దర్గాజంక్షన్లో చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య, సంతపేట, రాగిమాను జంక్షన్‌లో ఎస్‌ఐ రమేష్ వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. యుడు ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో తనిఖీ చేస్తున్నారు.