Share News

Polycet: పాలిసెట్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:30 AM

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కో-ఆర్డినేటర్‌ మొహమ్మద్‌ తెలిపారు.

Polycet: పాలిసెట్‌కు సర్వం సిద్ధం
పలమనేరులో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్జేడీ, కోఆర్డినేటర్‌ తదితరులు

పలమనేరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కో-ఆర్డినేటర్‌ మొహమ్మద్‌ తెలిపారు.బుధవారం ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జరగబోయే ఈ పరీక్షను కుప్పం పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాలలో 585 మంది, పలమనేరు పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాలలో 1626 మంది విద్యార్థులు రాస్తున్నట్లు తెలిపారు. పలమనేరు పరిధిలో మహిళా పాలిటెక్నిక్‌, బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను మంగళవారం ఎస్వీయూ రీజియన్‌ ఆర్జేడీ నిర్మల్‌కుమార్‌ ప్రియ,చిత్తూరు జిల్లా పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌, కుప్పంలోని డాక్టర్‌ వైసీ జేమ్స్‌ యెన్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగన్నాథరావు, జిల్లా పరిశీలకుడు డాక్టర్‌ చిన్నపరెడ్డి, సెంటర్‌ పరిశీలకుడు సుబ్బన్న, కోఆర్డినేటర్‌ మొహమ్మద్‌ పరిశీలించారు. ఇప్పటికే హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు గంట ముందు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్ను, హెచ్‌.బి. పెన్సిళ్లు, షార్పనర్‌, ఎరేజరు, హాల్‌ టికెట్టు తప్పకుండా వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు ఏవీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరన్నారు. ఇతర వివరాలకు 9989064100, 9490309037 అనే నెంబర్లలో సంప్రదించాలని కో ఆర్డినేటర్‌ జగన్నాథరావు తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 12:30 AM