Elephants Attack: దారుణం.. భక్తులపై దాడి చేసిన ఏనుగులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 25 , 2025 | 08:14 AM
ఆంధ్రప్రదేశ్: వై.కోటకు చెందిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల గుండా తలకోనకు నడుస్తున్న భక్తులపైకి ఏనుగులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.

అన్నమయ్య: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన (Gundalakona) అటవీ ప్రాంతంలో భక్తులపై ఏడుగులు దాడి (Elephants Attack on Devotees) చేశాయి. ఈ దాడిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మహాశివరాత్రి (Mahashivratri) ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు శేషాచలం (Seshachalam) అడవుల గుండా తలకోన(Talakona)కు నడిచివెళ్తున్నారు. అయితే అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తుల చూసి రెచ్చిపోయింది. భక్తులపైకి దూసుకెళ్లేందుకు ఏనుగులు ప్రయత్నించగా వారంతా వాటిని భయపెట్టేందుకు గట్టిగట్టిగా కేకలు వేశారు. అయినప్పటికీ వారందరినీ చుట్టుముట్టేందుకు యత్నించాయి. దీంతో భక్తులంతా పరుగులు పెట్టారు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి మరీ దాడి చేసి నలుగురిని చంపేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించగా.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. కాగా, అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరిని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన మణెమ్మ, చెంగల్ రాయుడుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏనుగుల దాడి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Gold and Silver Rates Today: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..