Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:57 AM
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

తిరుపతిరూరల్, జూలై11(ఆంధ్రజ్యోతి): ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు శుక్రవారం వర్సిటీ పరిపాలనాభవనంలోని సమావేశ మందిరంలో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ జేవీరమణ, అధికారుల సమక్షంలో ఎన్‌ఐఏబీ డైరెక్టర్ డాక్టర్ జి.తారుశర్మ ఈ ఒప్పంద పత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేవీ రమణ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న బయోటెక్నాలజీని ఉపయోగించుకుని జంతువుల ఆరోగ్యం, ఉత్పాదకత మెరుగుపరచుకోవడం, అధునాత పరిశోధనల కోసం ఈ ఎంవోయూను కుదుర్చుకున్నామన్నారు. రిజిస్ర్టార్ రవికుమార్, డీన్ వీరబ్రహ్మయ్య, డీఆర్ సీహెచ్ శ్రీలత, సీవోఈ చెంగల్వరాయులు, డెయిరీ డీన్ నాగేశ్వరరావు, వివిధ విభాగాధిపతులు రాణీ ప్రమీల, శ్రీదేవి, సూర్యనారాయణ, సురేష్, ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.