Share News

Chandrababu-Namburi: వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Jul 20 , 2025 | 07:10 PM

పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను కిందకేసి పగులగొట్టిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, అతని అనుచరులను ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా..? ఆయన హఠాన్మరణం..

Chandrababu-Namburi: వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu-Namburi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల్లో పాల్వాయిగేటు పోలింగ్ బూత్ లోకి వచ్చి ఈవీఎంలను నేలకేసికొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా?.. అప్పట్లో ఆ వీడియో వైరల్ కూడా అయింది. బాధాకర విషయం ఏంటంటే, మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సదరు టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు ఇవాళ(ఆదివారం) గుండెపోటుతో మృతిచెందారు. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాము దిగిన ఫొటోతోపాటు అప్పటి పోలింగ్ బూత్ ఘటనకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


'పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడం విచారకరం. నాడు ప్రతిపక్షంలో వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన యోధుడిని కోల్పోవడం బాధగా ఉంది. పసుపుజెండా చేతబట్టి రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తిగా నిలిచింది. శేషగిరిరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.' అని చంద్రబాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Updated Date - Jul 20 , 2025 | 07:40 PM