MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు
ABN , Publish Date - May 01 , 2025 | 05:22 AM
175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు వేస్తూ, 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కి సీఎం చంద్రబాబు నేడు శుభారంభం. మే డే సందర్భంగా కార్మికులకు కానుకగా పార్కుల ప్రారంభం.

నేడు నెల్లూరు జిల్లా నారంపేటలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం సిద్ధించే దిశగా తొలిఅడుగు పడింది. రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 పారిశ్రామిక పార్కులను, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ)ను కార్మిక దినోత్సవ (మే డే) కానుకగా.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించనున్నారు. ఇక్కడ 55 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన పార్కుతోపాటు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఎంఎ్‌సఎంఈ పార్కులను, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎ్‌ఫసీని సీఎం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
మొత్తం 909 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 11 పారిశ్రామిక పార్కుల్లో రోడ్లు, విద్యుత్తు, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 199 కోట్లు ఖర్చు చేసింది. త్వరలోనే మరో 1,455 ఎకరాల్లో అభివృద్ధి చేసే 25 ఎంఎస్‌ఎంఈ పార్కులు, 14 ఎఫ్‌ఎఫ్‌సీలను ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తంగా తొలిదశలోనే రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2028కల్లా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి పెద్దఎత్తున ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నెలకొల్పే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..