Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:14 PM
Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అందులో 25% ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. అవసరమైతే ఎంఐఎస్ పెంపునకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. మిర్చి రైతులకు ఇది కేవలం ఊరట మాత్రమే కాదని.. బలమైన అండ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మిర్చి కనీస మద్దతు ధర రూ. 7 వేలుగా నిర్ణయించింది. అయితే ఇటీవల మిర్చి రైతులకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో వారు తీవ్ర ఆందోళన చెందుతోన్నారు. అలాంటి వేళ గుంటూరులోని మిర్చి యార్డ్‌లో ఆ పంట రైతులను పరామర్శించాలని వైసీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పోలీసులు వైఎస్ జగన్‌కు స్పష్టం చేశారు.
Also Read: మీ పాన్ కార్డులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?
మిర్చి రైతు పరామర్శకు వెళ్ల వద్దంటూ ఆయనకు సూచించారు. కానీ పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి.. వైఎస్ జగన్ మిర్చి యార్డ్‌లో రైతులను పరామర్శించారు. మరోవైపు అదే సమయంలో మిర్చి రైతుల సమస్యలపై ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల వేతలపై చర్చించారు.
Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..
అలాగే సీఎం చంద్రబాబు తీసుకు వెళ్లిన సమస్యలను సైతం ఈ భేటీలో ప్రస్తావించారు. దీంతో మిర్చి రైతులకు శుభావర్త అందింది. ఇక ఇదే విషయాన్ని కేంద్రంతో చర్చించి.. మిర్చి రైతులకు మేలు జరిగేలా కృషి చేయాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. ఆ క్రమంలో మిర్చి రైతులను ఆదుకొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
For Andhrapradesh News And Telugu News