Share News

National MSME: ఏపీకి జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:57 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని లలిత్‌ హోటల్‌లో నేషనల్‌ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డ్స్‌- 2025 పేరుతో వీటిని ప్రదానం చేశారు.

National MSME: ఏపీకి జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డు

అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని లలిత్‌ హోటల్‌లో ‘నేషనల్‌ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డ్స్‌- 2025’ పేరుతో వీటిని ప్రదానం చేశారు. ఎమ్ఎస్ఎమ్ఈ రంగంలో ఉత్తమ రాష్ట్రాల విభాగంలో మన రాష్ట్రం రజత పురస్కారాన్ని గెలుచుకుంది.


రాష్ట్రం తరఫున పరిశ్రమల శాఖ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌..ఎమ్ఎస్ఎమ్ఈ మాజీ కేంద్రమంత్రి కల్‌రాజ్‌ మిశ్రా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశకత్వం, ప్రోత్సాహంతోనే రాష్ట్రానికి జాతీయ ఎమ్ఎస్ఎమ్ఈ ఇంపాక్ట్‌ అవార్డును సాధించగలిగామని రాష్ట్ర ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. భవిష్యత్తులో మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. ఇంతకన్నా మంచి ఫలితాలు సాధించి, అత్యుత్తమ పతకాలు అందుకుంటామని ఆయన చెప్పారు.

Updated Date - Jun 28 , 2025 | 04:57 AM