Share News

Panchayat Raj : కదిలిన కారుణ్య నియామకాల ఫైల్‌

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:50 AM

కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది!

 Panchayat Raj : కదిలిన కారుణ్య నియామకాల ఫైల్‌

  • పీఆర్‌లో ఖాళీల భర్తీకి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవ

  • 1488 పోస్టుల భర్తీకి ఆదేశాలు.. పాత ఫైల్‌ బూజుదులిపి ఫైనాన్స్‌కు

  • సీఎం ఆమోదమే తరువాయి.. బాధిత కుటుంబాలకు ఊరట

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది! మూడేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయా కుటుంబాలు ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మెరపెట్టుకోవడంతో ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వెంటనే నియామకాలకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కారుణ్య నియామకాల ఫైల్‌ను పంచాయతీరాజ్‌ అధికారులు బూజుదులిపి ఆర్థిక శాఖకు పంపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఫైల్‌ సీఎం వద్దకు చేరింది. ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే కరోనాలో మరణించిన 1,488 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలగనుంది. మొదటి, రెండో వేవ్‌ కరోనా కారణంగా రాష్ట్రంలో 2917 మంది ఉద్యోగులు మరణించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెకరేట్ల పరిధిలో 330మంది, యూనివర్సిటీల్లో 83మంది, కార్పొరేషన్లు, సొసైటీలకు సంబంధించి 560 మంది మరణించారు. కారుణ్య నియామకాల కోసం 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అప్పట్లో నిర్ణయించారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 1,149 మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌ దశలోనే ఉన్నాయి. 107 మంది దరఖాస్తులు చేసుకోలేదు. నియామ కాలకు సీఎం చంద్రబాబు ఆమోదం లభిస్తే ఆయా కుటుంబాలకు ఊరట దక్కనుంది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 03:52 AM