Share News

AP Government: సహకార పదవులు భర్తీ

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:29 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకార రంగంలోని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. 10 డీసీసీబీ, 10 డీసీఎంఎస్‌ చైర్మన్లను నియమించి, టీడీపీకి ఎక్కువ చైర్మన్లు దక్కాయి, జనసేనకు ఒక్కోటి కేటాయించింది

AP Government: సహకార పదవులు భర్తీ

10 డీసీసీబీ, 10 డీసీఎంఎ్‌సలకు చైర్మన్లు

టీడీపీకి తొమ్మిదేసి.. జనసేనకు ఒక్కోటి

2-3 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు

  • కాకినాడ, ఏలూరు, ఒంగోలు పెండింగ్‌

  • త్వరలోనే వాటికీ నియామకాలు

  • పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జులు?

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం సహకార రంగంలోని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. 10 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు, 10 జిల్లా సహకార మార్కెట్‌ సంఘాల(డీసీఎంఎస్‌)కు సోమవారం చైర్మన్లను ప్రకటించింది. ఇందు లో టీడీపీకి తొమ్మిదేసి దక్కగా.. ఒక డీసీసీబీ, ఒక డీసీఎంఎస్‌ను జనసేనకు ఇ చ్చారు. తూర్పుగోదావరి (కాకినాడ), పశ్చిమగోదావరి(ఏలూరు), ప్రకాశం(ఒంగోలు) డీసీసీబీలు, డీసీఎంఎస్‌లను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే వీటికీ చైర్మన్లను నియమిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం కోసం కష్టపడి పని చేసిన నేతలను గుర్తించి.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర టనేతలకు అవకాశం కల్పించారు.


బీజేపీకి కూడా ఒక్కొక్కటి దక్కుతుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాల స్థాయి లో కొనసాగుతున్న డీసీసీబీలు, డీసీఎంఎస్‌లకు ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్లు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. సహకార సంస్థలకు రైతు వర్గానికి చెందిన నేతలను పాలకవర్గంలో నియమించడం ద్వా రా వ్యవసాయ అనుబంధ రంగాలకు మెరుగైన సేవలు అందుతాయన్న ఉద్దేశంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు నామినేషన్‌ పద్ధతిలో చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)లకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైన చైర్మన్ల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు పాలక వర్గాలను ఎన్నుకోవాలి. కానీ గత ప్రభు త్వం 1964 సహకార చట్టంలోని సెక్షన్‌ 30(7)ఏ ప్రకారం ఎన్నికలు నిర్వహించలేనప్పుడు ఆరు నెలల కాల వ్యవధితో పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ(పీఐసీ)లను నియమించవచ్చన్న వెసులుబాటుతో ఐదేళ్ల పాటు అనధికార పీఐసీలను కొనసాగించింది. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక సహకార సంఘా ల కంప్యూటరీకరణ సాగుతున్నందున పీఏసీఎస్‌లకు సహకార శాఖ అధికారులను, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు జాయింట్‌ కలెక్టర్లను అధికారిక పీఐసీలుగా నియమించారు. ఇప్పు డు డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లను ప్రకటించింది.


సంబంధిత ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ కానున్నాయి. అలాగే త్వరలో పీఏసీఎస్‌లకు అనధికార పీఐసీలను నియమించనున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు చివరిసారిగా 2013 జనవరిలో జరిగాయి. ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలను.. హైకోర్టు చెప్పినా పుష్కర కాలంగా ప్రభుత్వాలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పాలక వర్గాలను కొనసాగిస్తున్నాయి.

1.jpg


2.jpg


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:29 AM