APJ Abdul Kalam Death Anniversary: అబ్దుల్ కలాం వర్ధంతి.. ఆయన సేవలను స్మరించుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:08 AM
భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.

దేశ అణు, శాస్త్రీయ రంగాలకు దిశానిర్దేశం చేసిన మహా మనిషి, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి (APJ Abdul Kalam Death Anniversary 2025) సందర్భంగా ఆయన మానవతా సేవలను గుండెల్లో నిలుపుకుందాం. ఆయన స్ఫూర్తితో యువతకు కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం నేర్పిన గొప్ప దార్శనికుడు.
సాంకేతికత, విద్య, సమాజ సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన కలాం సేవలు భారతదేశ పురోగతికి మార్గదర్శనం. ఆయన జీవితం మనకు నిస్వార్థ సేవ, అంకితభావం, దేశభక్తి నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలాం వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను సాకారం చేద్దామని సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా పేర్కొన్నారు.
నారా లోకేష్ సైతం..
భారతరత్న, భారతదేశ మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి హృదయపూర్వక నివాళులు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన కలాం శాస్త్రవేత్తగా దేశానికి చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవి. శాస్త్ర విజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
ఆయన వ్యక్తిత్వం..
తన ఉపన్యాసాలతో, ఆచరణతో, కలలతో యువతలో ఆశావాదాన్ని రేకెత్తించిన కలాం స్ఫూర్తిదాయక నాయకుడు. ప్రజల రాష్ట్రపతిగా అందరికీ చేరువైన ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత. విద్య, శాస్త్రం, అభివృద్ధి రంగాలలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రతి యువకుడూ కలాం కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా కలాం సేవలను స్మరించుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి