Share News

AP Budget 2025-26 Live Updates: బడ్జెట్‌లో గుడ్ న్యూస్.. మే నుంచి అకౌంట్లో డబ్బులు

ABN , First Publish Date - Feb 28 , 2025 | 09:22 AM

AP Budget 2025-26 Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.3,22,359 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌‌ను ప్రశేపెట్టిన ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేసింది.. మరి ఏ శాఖకు ఎంత కేటాయించిందో చూద్దాం..

AP Budget 2025-26 Live Updates: బడ్జెట్‌లో గుడ్ న్యూస్.. మే నుంచి అకౌంట్లో డబ్బులు
AP Budget 2025-26

Live News & Update

  • 2025-02-28T17:22:04+05:30

    బడ్జెట్‌లో గుడ్ న్యూస్.. మే నుంచి అకౌంట్లో డబ్బులు

    • బడ్జెట్‌లో కీలక పథకాలను వివరించిన మంత్రి నారాయణ

    • తల్లికి వందనం నిధులను మే నెలలో విడుదల చేస్తామన్న మంత్రి

  • 2025-02-28T13:42:34+05:30

    అమరావతి: బడ్జెట్‌పై బొత్స సత్యనారాయణ రియాక్షన్..

    • బడ్జెట్ అంతా ఆత్మస్తుతి , పరనింద లా ఉంది

    • గత ప్రభుత్వాన్ని తిట్టడం.. ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని పొగుడుకోవడమే కనిపించింది.

    • ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరం.

    • ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారు.

    • ప్రభుత్వం ప్రజలను వంచించింది, మోసం చేసింది.

    • 18-50ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు. ఆ మాటే లేదు.

    • బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు.

    • నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది.

    • అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదు.

    • 81లక్షల మంది విద్యార్థులు ఉండగా..12వేల కోట్లు కావాల్సి ఉంటే.. రూ. 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు.

    • 52 లక్షల మంది రైతులకు రైతుభరోసా రూ. 20 వేలు ఇచ్చేందుకు రూ. 12వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరగా కేటాయించారు.

    • ఉగాది నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు.

    • గత ప్రభుత్వంలో 3వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే.. ఈ బడ్జెట్‌లో రూ. 300 కోట్లే పెట్టారు.

    • గుంటూరు మార్కెట్‌లో ఒక్క కిలో, బస్తా, క్వింటల్ మిర్చినైనా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు.

    • జబ్బలు చరచుకోవడం కాదు.. ఆచరణలో చూపిస్తామన్నారు.. చూపించాలి.

    • ప్రజలకు న్యాయం జరిగే బడ్జెట్ కాదు.. సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం జరగదు.

    • బడ్జెట్‌తో ఏ వర్గానికీ న్యాయం జరగదు.

  • 2025-02-28T13:42:06+05:30

    బడ్జెట్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన ఇదే..

    • అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ అద్బుతంగా ఉంది: మంత్రి అనగాని సత్యప్రసాద్.

    • ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎం చంద్రబాబు ప్రజల అకాంక్షలను బడ్జెట్‌లో పొందుపరిచారు.

    • అభివృద్ధి, సంక్షేమంతోపాటు హామీల అమలుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

    • రైతే ముందు అనే నినాదాన్ని బడ్జెట్లో కేటాయింపుల ద్వారా ఆచరణలో చూపించారు.

    • అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం.

    • రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు అధిక కేటాయింపులు చేశారు.

    • బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారు.

  • 2025-02-28T13:19:25+05:30

    ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంది: మంత్రి సత్యకుమార్

    • ఆరోగ్యశాఖకు బడ్జెట్‍లో ప్రాధాన్యత ఇచ్చారు

    • మొత్తం బడ్జెట్‍లో దాదాపు 6 శాతం ఆరోగ్యం, వైద్య, విద్యకు కేటాయించారు

    • అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారు: సత్యకుమార్

  • 2025-02-28T13:06:49+05:30

    అమరావతి: వార్షిక బడ్జెట్‌పై టీడీఎల్పీ అభినందనలు.

    • టిడిఎల్పి సమావేశంలో చర్చించిన అంశాలు.

    • అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై చర్చ.

    • రాష్ట్రానికి కేంద్ర నిధులు తెచ్చే అంశంలో మంత్రులు, ఎంపీల సమన్వయంపై చర్చ.

    • పోలవరం-బనక చర్ల లింక్ పనులు అనుసంధానం.

    • విజన్ 2047లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీపై - చర్చ.

    • విద్య రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నదానిపై చర్చ.

    • వాట్సప్ అప్ ద్వారా అందుతున్న 161 సేవలపై సమావేశంలో చర్చ.

    • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించిన అంశాలపై చర్చ.

  • 2025-02-28T12:43:20+05:30

    అమరావతి: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టిడిఎల్‌పి, పార్లమెంటరీ పార్టీ సమావేశం.

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం.

    • సమావేశంలో పలు అంశాలపై చర్చ.

    • 8 నెల్లలో సాధించిన విజయాల పై చర్చ.

    • తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ కార్యవర్గం నియామకంపై సమావేశంలో చర్చ.

    • మిర్చి ధర పెంపుదల, రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై చర్చ.

  • 2025-02-28T11:40:32+05:30

    • డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు

    • 875 కిసాన్‌ డ్రోన్‌ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు

    • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు

    • విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు

    • రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు

    • అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు

    • ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు

  • 2025-02-28T11:29:56+05:30

    వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న

    • రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

    • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు

    • దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారం: అచ్చెన్న

    • వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి: అచ్చెన్న

    • సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యం: అచ్చెన్న

    • గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించాం

    • 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశాం: అచ్చెన్న

    • 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశాం: అచ్చెన్న

    • వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం: అచ్చెన్న

    • ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు: అచ్చెన్న

    • భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం: అచ్చెన్న

    • అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు

    • గ్రోత్‌ ఇంజిన్లుగా 11 పంటలు: అచ్చెన్నాయుడు

    • ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు

    • ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహానికి రూ.61 కోట్లు

    • వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు

    • 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం

  • 2025-02-28T11:15:14+05:30

    • బడ్జెట్‌పై ప్రతి సభ్యుడికి పూర్తి అవగాహన రావాలి: స్పీకర్‌ అయ్యన్న

    • పూర్తి అవగాహనతో బడ్జెట్‌పై చర్చ జరగాలి: స్పీకర్‌ అయ్యన్న

    • రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: స్పీకర్‌

    • బడ్జెట్‌ ప్రతులను ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా చదవాలి: స్పీకర్‌

    • సభ్యులందరికీ వాట్సాప్‌ గ్రూప్‌లో బడ్జెట్‌ ప్రతులు: స్పీకర్‌

    • అందరికీ అర్థమయ్యే విధంగా బడ్జెట్‌పై చర్చ జరగాలి: స్పీకర్‌

  • 2025-02-28T11:14:59+05:30

    • పోలవరం కోసం రూ.6,705 కోట్లు

    • జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు

    • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు

    • పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు

    • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు రూ.1,228 కోట్లు

    • బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

    • ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు

    • ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు

    • అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు

    • మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు

    • వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు

    • పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు

    • R&B కి రూ.8,785 కోట్లు

    • యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు

    • తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు

    • నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు

    • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు

    • రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు

    • ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు

    • ITI, IITల కోసం రూ.210 కోట్లు

    • దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు

    • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు

    • ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు

    • ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు

    • మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు

  • 2025-02-28T10:46:33+05:30

    • పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు

    • చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు

    • RTGSకు రూ.101 కోట్లు

    • ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు

    • అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు

  • 2025-02-28T10:44:34+05:30

    • ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు

    • ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు

    • మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు

    • తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు

    • అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు

    • దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు

    • రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు

    • బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు

  • 2025-02-28T10:43:53+05:30

    • PMAY కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణం

    • టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణం

    • ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు..

    • ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.75 వేలు

  • 2025-02-28T10:43:41+05:30

    • ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: పయ్యావుల

    • పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు

    • దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు

    • 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం: పయ్యావుల

    • అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు

    • తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు

    • రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా

    • ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల ఇచిత విద్యుత్‌

    • చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

  • 2025-02-28T10:43:40+05:30

    • ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు

    • పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు

    • స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు

    • ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు

  • 2025-02-28T10:42:28+05:30

    కేటాయింపులివే..

    • పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు

    • బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు

    • వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు

    • పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు

    • జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు

    • మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు

    • విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు

    • వ్యవసాయానికి రూ.11,636 కోట్లు

    • సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు

    • ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు

    • రవాణా శాఖకు రూ.8,785 కోట్లు

  • 2025-02-28T10:42:27+05:30

    • ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు.

    • రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం.

    • రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది.

    • అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకున్నాయి.

    • సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించాం.

  • 2025-02-28T10:41:15+05:30

    సంక్షిప్తంగా బడ్జెట్ స్వరూపం ఇదీ..

    • 2025-26 వార్షిక బడ్జెట్‌ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు

    • తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్‌

    • రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

    • వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేలకోట్లు

    • మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు

    • రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు

    • రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు

    • ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు

  • 2025-02-28T10:26:52+05:30

    అమరావతి: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల.

    • నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి.

    • ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్.

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

    • తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్.

    • సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.

    • రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.

    • రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.

    • ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.

    • మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు.

    • డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం.

    • నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారు.

    • తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేం.

    • రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.

    • రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం.

    • రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది.

    • రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు.

    • ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.

  • 2025-02-28T10:21:52+05:30

    అమరావతి: కొనసాగుతున్న ఏపీ బడ్జెట్ ప్రసంగం

    • పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు.

    • బిసి వెల్ఫేర్‌కు రూ. 23,260 కోట్లు.

    • వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు.

    • పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెట్రూ. 18,848కోట్లు.

    • జలవనరుల అభివృద్ది శాఖ రూ. 18,020 కోట్లు.

    • మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ. 13,862 కోట్లు.

    • విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు.

    • వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు.

    • సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు.

    • ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రూ. 10,619 కోట్లు.

    • రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు.

  • 2025-02-28T10:16:19+05:30

    ఏపీ బడ్జెట్.. రూ. 3.22 లక్షల కోట్లు..

    • అమరావతి: వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు.

    • వివిధ ప్రాజెక్టులలో నిధులు కొరత ను అధిగమించేందుకు ఈ ఫండ్.

    • 3 లక్షల 22 వేల కోట్లు తో బడ్జెట్.

    • 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.

    • హౌసింగ్ లో నడుస్తున్న గృహ నిర్మాణానికి ఎస్సీలకు 50 వేల రూపాయలు ST లకు 70 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం.

  • 2025-02-28T10:14:29+05:30

    అమరావతి: బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కీలక కామెంట్లు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల.

    • గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి.

    • వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చిన పయ్యావుల.

    • తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.

    • చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

    • అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం.

    • వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు.

    • కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.

  • 2025-02-28T10:09:57+05:30

    • అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి పయ్యావుల

    • వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగింది: పయ్యావుల

    • NDA కూటమిపై విశ్వాసంతో ప్రజలు అధికారం ఇచ్చారు

    • విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం: పయ్యావుల

    • గత వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది: పయ్యావుల

  • 2025-02-28T10:06:54+05:30

    • ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

    • అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల

  • 2025-02-28T10:06:03+05:30

    • చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ

    • 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్‌

    • అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల

  • 2025-02-28T09:26:40+05:30

    మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల..

    • అమరావతి: ఈరోజు 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

    • అందులో భాగంగా ముందుగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలసి బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

    • ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, IA&AS, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్ లు హాజరు.

    • బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల.

    • సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్న పయ్యావుల.

    • కెబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.

  • 2025-02-28T09:22:22+05:30

    మరికాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్..

    • అమరావతి: బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్.

    • 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంత్రి.

    • ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్న మంత్రి పయ్యావుల.