Share News

ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి: ఏపీటీఎఫ్‌-1938

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:54 AM

ఏపీటీఎఫ్-1938 టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పులో చురుకుగా పాల్గొనాలని కోరారు.ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడు రోజుల కార్యక్రమం చేపట్టనున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి: ఏపీటీఎఫ్‌-1938

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంలో చురుకుగా పాల్గొనాలని ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి టీచర్లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు చేపడుతున్న ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 03:59 AM