AP Budget Session : 28న రాష్ట్ర బడ్జెట్
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:37 AM
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 26,27 తేదీలు సెలవు దినాలు. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ మేరకు గవర్నర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.